
క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం.. ఇండిగో ఉద్యోగిని దుర్మరణం
ముంబైలో ఇండిగో ఎయిర్‌లైన్స్ మహిళా ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సెప్టెంబర్ 18న బోరివాలి ఈస్ట్‌లోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఈ ఘటన జరిగింది. మీరా రోడ్‌కు చెందిన కైనూర్ మిస్త్రీ (32) విధులు ముగించుకుని కంపెనీ క్యాబ్‌లో ఇంటికి వెళ్తుండగా.. డ్రైవర్ విజయ్ ఖోస్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో రైలింగ్‌ను ఢీకొట్టింది. వెనుక సీట్లో ఉన్న కైనూర్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమెకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




