
ఇరాన్‌తో చర్చలు.. ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌కు ట్రంప్ బ్రేక్
ఇరాన్‌తో దౌత్య చర్చల్లో పురోగతి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్థాన్, ఇతర దేశాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. ఇరాన్‌తో సంపూర్ణ ఒప్పందం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ లొంగిపోవాలని, లేదంటే పూర్తిస్థాయి పోరాటానికి దిగితే ఆపలేమని హెచ్చరించారు.




