బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి

53784చూసినవారు
బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి
అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు చిరంజీవి స్పందించారు. తాను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే వెళ్ళానని, జగన్ తనను సాదరంగా ఆహ్వానించి సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారని చిరంజీవి తెలిపారు. సమయం ఇస్తే అందరం వస్తామని చెప్పగా, కోవిడ్ నిబంధనల ప్రకారం ఐదుగురే రావాలని చెప్పినా, పదిమందిమి వస్తామని చెప్పినా జగన్ అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదని చిరంజీవి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్