సినీ ప్రస్థానంలో 48 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ‘మెగా యూత్ ఫోర్స్ ఫ్యాన్స్ మీట్’లో
చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై,
చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై వస్తున్న విమర్శలపై ఆయన తీవ్రంగా స్పందించారు. బ్లడ్ బ్యాంక్‌లో రక్తాన్ని విక్రయిస్తున్నారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. ఎలాంటి విరాళాలు తీసుకోకుండా తన కష్టార్జితంతోనే బ్లడ్ బ్యాంక్‌ను నిర్వహిస్తున్నానని స్పష్టం చేశారు. రక్తదానం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నామని, ఇలాంటి ఆరోపణలకు తాను ప్రాధాన్యం ఇవ్వనని అన్నారు.