
వైఎస్సార్ వర్ధంతి: నివాళులర్పించిన జగన్, షర్మిల (వీడియో)
AP: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ జగన్, ఏపీసీసీ చీఫ్ షర్మిల వేర్వేరుగా నివాళులర్పించారు. తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి ఇద్దరు నేతలు ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంజలి ఘటించారు.




