చిత్తూరు రోడ్డు ప్రమాదం ఘటన.. వెలుగులోకి సీసీ ఫుటేజ్ (వీడియో)

21చూసినవారు
AP: చిత్తూరు జిల్లా పలమనేరు హైవేపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కర్ణాటకలోని రాజాజీనగర్‌కు చెందిన మోహన్ దాస్ (71), నాగరాజారావు (61), కుసుమ (61), జయంతి (59), పూజ (33)గా పోలీసులు గుర్తించారు. తిరుమల దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్