
ఎన్టీఆర్ జిల్లాలో రౌడీషీటర్ దారుణ హత్య
ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నవీన్ రెడ్డి అనే రౌడీషీటర్‌ను గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి చంపేశారు. ఈ ఘటనలో ఇద్దరు దుండగులు స్కూటీపై వచ్చి, హత్య అనంతరం బాధితుడిని ఆస్పత్రిలో వదిలి పారిపోయినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగుల కోసం గాలింపులు చేపట్టారు.




