ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


పాక్ మహిళ ప్రేమలో పడి సరిహద్దుల్లో ఆర్మీకి చిక్కిన యువకుడు
Dec 08, 2025, 09:12 IST/

పాక్ మహిళ ప్రేమలో పడి సరిహద్దుల్లో ఆర్మీకి చిక్కిన యువకుడు

Dec 08, 2025, 09:12 IST
విశాఖకు చెందిన ప్రశాంత్ అనే యువకుడు పాకిస్థాన్ మహిళతో ప్రేమలో పడి రాజస్థాన్ ఖాజువాలా వద్ద ఆర్మీకి పట్టుబడ్డాడు. సరిహద్దుల వైపు వెళ్తుండగా సైనికులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. 2017లో సరిహద్దులు దాటి పాకిస్థాన్ వెళ్లిన ప్రశాంత్‌ను అక్కడి అధికారులు అరెస్టు చేసి 2021 వరకు నిర్బంధంలో ఉంచి, ఆ తర్వాత భారత్‌కు పంపినట్లు సమాచారం. జైలులో ఉన్నప్పుడే ఆ మహిళతో ప్రేమలో పడ్డానని అతడు తెలిపాడు. అయితే, పాకిస్థాన్‌కు వెళ్లేందుకు అతడు ప్రయత్నించడంపై సైన్యం అనుమానాలు వ్యక్తం చేస్తోంది.