విధుల్లో ఉండగా గుండెపోటుతో సీఐ మృతి

63చూసినవారు
విధుల్లో ఉండగా గుండెపోటుతో సీఐ మృతి
AP: విజయవాడ‌లో  విషాదం చోటుచేసుకుంది. నున్న సీఐ అహ్మద్ అలీ విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడలోని అలంకార్ ధర్నా చౌక్‌ సెంటర్‌లో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో పోలీసు వర్గాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్