కాంగ్రెస్ నేతలకు భోజనాలు వడ్డించిన సీఐ (వీడియో)

9చూసినవారు
TG: అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు నకిరేకల్ సీఐ వెంకటేశ్వర్లు భోజనాలు వడ్డిస్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ నాయకులకు ఆయన స్వయంగా మటన్ ముక్కలు వడ్డిస్తూ కనిపించారు. తాను ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి అనే విషయాన్ని మరిచి, క్యాటరింగ్ బాయ్‌లా అధికార పార్టీ నేతల వద్ద ఇలా చేయడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉండాలని  సూచిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్