వీసాకు సిబిల్ స్కోరు అవసరం లేదా?

9836చూసినవారు
వీసాకు సిబిల్ స్కోరు అవసరం లేదా?
విదేశాలకు వెళ్లాలనుకునేవారిలో సిబిల్ స్కోరు తక్కువగా ఉంటే వీసా తిరస్కరణ అవుతుందనే అపోహలున్నాయి. అయితే, నిపుణుల ప్రకారం.. వీసా దరఖాస్తు ప్రక్రియలో ఇమిగ్రేషన్ అధికారులు సిబిల్ స్కోరును పరిగణనలోకి తీసుకోరు. అమెరికా, యూకే, కెనడా వంటి దేశాల వీసా నిబంధనల్లో సిబిల్ స్కోరుకు ప్రాధాన్యత లేదు. వీసా అధికారులు దరఖాస్తుదారుల ఆర్థిక స్థిరత్వం, స్వదేశంతో అనుబంధం, ఖర్చులు భరించే సామర్థ్యం, తిరిగి స్వదేశానికి వచ్చేస్తారనే నమ్మకం వంటి అంశాలను పరిశీలిస్తారు.

సంబంధిత పోస్ట్