TG: కరీంనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఆయనను ఏప్రిల్ 4న హైదరాబాద్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. జనవరి 29న సమ్మక్క జాతర సందర్భంగా జరిగిన గొడవ నేపథ్యంలో హుజూరాబాద్‌లో కేసు నమోదయ్యింది. ఈ కేసులో కరీంనగర్ సీపీ, ఇతర పోలీసులపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రధాన కారణంగా పేర్కొంటూ, విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు.