భారీగా పెరగనున్న సిగరెట్ ధరలు?

2చూసినవారు
భారీగా పెరగనున్న సిగరెట్ ధరలు?
ధూమపాన ప్రియులకు మరో షాక్ తగలనుంది. సిగరెట్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. మే నెలలో ITC, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ సంస్థలు 17% ధరల పెంపునకు యోచిస్తున్నాయని సమాచారం. దీంతో ITC గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం ప్యాక్ ధర రూ.115 నుంచి రూ.135కు చేరవచ్చని జాతీయ మీడియా నివేదించింది. ఈ నేపథ్యంలోనే ITC, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ సంస్థల షేర్లు గణనీయంగా పెరిగాయి. గత ఫిబ్రవరిలో కూడా కేంద్రం ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేయడంతో సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరలు పెరిగిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్