అమెరికాలో పిల్లలకు పాస్‌పోర్ట్ జారీ నిబంధనలను కఠినతరం చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చింది. కొత్త ముసాయిదా మార్గదర్శకాలు అమల్లోకి వస్తే.. అమెరికాలో పుట్టిన పిల్లల పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసే తల్లిదండ్రులు తమ పౌరసత్వం లేదా ఇమ్మిగ్రేషన్ స్థితికి సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సి రావచ్చు.
అమెరికా పౌరులు పాస్‌పోర్ట్, జనన ధ్రువీకరణ పత్రం, ఇతర దేశాల పౌరులు గ్రీన్ కార్డ్, ఐ-94 వంటి పత్రాలు ఇవ్వాల్సి ఉండొచ్చు. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ఈ ప్రతిపాదన చర్చనీయాంశమైంది.