TG: దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులు స్వస్థలాలకు వెళ్తున్నారు. స్కూళ్లకు దసరా సెలవులు ఇవ్వడంతో ఏపీ ప్రజలు పెద్దఎత్తున తరలివెళ్తున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ ఏర్పడింది. చౌటుప్పల్, పంతంగి, పెద్దకాపర్తి, చిట్యాల ప్రాంతాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి.