
యాచకురాలిని పెళ్లి చేసుకున్న యువకుడు
భిక్షాటన చేసే బాలిక పట్ల జాలిపడి, ఆమెను ఇంటికి తీసుకెళ్లిన గోలు యాదవ్ అనే యువకుడు తల్లిదండ్రుల అనుమతితో పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన బిహార్లోని బక్సర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గోలు యాదవ్ 'రియల్ లైఫ్ హీరో'గా నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాడు. నిస్సహాయురాలికి ఆపన్నహస్తం అందించాండంటూ అతని తీరుపై అందరి దృష్టి ఆకట్టుకుంది.




