AP: విజయనగరం జిల్లా, బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సీటు విషయంలో ఇద్దరు మహిళల మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ దాడిలో 14 ఏళ్ల బెజ్జుపల్లి భార్గవి అనే చిన్నారి తీవ్రంగా గాయపడింది. చిన్నారి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బొబ్బిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.