
గోవా నైట్‌క్లబ్ ఓనర్లు ఇద్దరూ.. థాయ్‌ల్యాండ్‌కు పరారీ
గోవాలోని నైట్‌క్లబ్‌లో శనివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది మరణించిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో నిందితులైన నైట్‌క్లబ్ యజమానులు గౌరవ్ లూత్రా, సౌరభ్ లూత్రా ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఢిల్లీ నుంచి థాయ్‌లాండ్‌లోని పుకెట్‌కు పారిపోయినట్లు ముంబై ఇమ్మిగ్రేషన్ బ్యూరో గుర్తించింది. వారిని అరెస్టు చేసేందుకు ఢిల్లీ వెళ్లిన పోలీసులు ఇంట్లో నోటీసు వదిలి, లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ప్రమాదం జరిగినప్పుడు యజమానులు ఢిల్లీలోనే ఉన్నట్లు సమాచారం.




