
బంగ్లాదేశ్లో హిందూ మహిళపై అత్యాచారం.. వీడియో తీసి
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు హిందువులను కొట్టి చంపిన ఉదంతాలు మరువక ముందే తాజాగా ఓ హిందూ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బంగ్లాలోని జనైదా జిల్లా కలిగంజ్ ప్రాంతంలో 40 ఏళ్ల హిందూ వితంతు మహిళపై ఇద్దరు స్థానికులు శనివారం అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెను చెట్టుకు కట్టేసి, జుట్టును కత్తిరించి, తీవ్రంగా హింసించారు. ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.




