
జైలు పాలు ఏఐ తోడేలు ఫొటో... కారణం ఇదే !
దక్షిణ కొరియాలోని డేజియోన్ నగరంలో జూ నుండి తప్పించుకున్న తోడేలు అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై లాక్డౌన్ ప్రకటించింది. నగరంలో రోడ్లపై తోడేలు తిరుగుతున్నట్లుగా ఆ ఫోటో కనిపించడంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. సీసీటీవీలలో కూడా తోడేలు జాడ కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దర్యాప్తులో ఆ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో సృష్టించబడినదని తేలింది. ఈ ఫోటోను పోస్ట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.




