TG: ULC భూముల సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ULC కేసులను పరిశీలించి క్రమబద్ధీకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనుమతులు ఉన్న భవనాలు, లేఔట్లకు క్లియరెన్స్ ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. 2016లో GO జారీ చేసినా గత ప్రభుత్వం అమలు చేయలేదని, 22A సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.