చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడలోని రాజన్న, భీమన్న ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలను ప్రాతకాల పూజ అనంతరం అర్చకులతో కలిసి అధికారులు ఆలయాలను మూసివేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల్లోపు చంద్రగ్రహణం ఉండగా సాయంత్రం సంప్రోక్షణ అనంతరం స్వామివార్లకు ప్రదోషకాల పూజ నిర్వహించనున్నారు. తర్వాత ఏడున్నర గంటల నుంచి దర్శనాలను యథావిధిగా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.