ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్‌ (వీడియో)

12624చూసినవారు
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లా యమునా లోయలో శనివారం క్లౌడ్ బరస్ట్‌ సంభవించింది. నౌగావ్ ప్రాంతంలో భారీ నష్టం వాటిల్లింది. అక్కడ శిథిలాలు ఒక ఇంటిని పూడ్చేసాయి. వాగు నుంచి వచ్చిన బురద నీరు అర డజనుకు పైగా ఇళ్లలోకి ప్రవేశించింది. సియోరి ఫాల్‌ పట్టు వద్ద క్లౌడ్ బరస్ట్‌ జరగడంతో లోతట్టు ప్రాంతాలు దెబ్బతిన్నాయని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆర్య తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్