
తెగిపోయిన రహదారి.. తాళ్ల సహాయంతో బయటకు వచ్చిన ప్రజలు
TG: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం గణపురం సమీపంలో భారీ వర్షాల కారణంగా రహదారి తెగిపోయింది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు నిచ్చెనలు, తాళ్ల సహాయంతో రోడ్డును దాటుతూ అవతలి వైపునకు వెళ్తున్నారు. ఈ పరిస్థితి వలన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.




