గోవాలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించింది. ముఖ్యమంత్రి ప్రమోద్ కుమార్ సావంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నైట్‌క్లబ్ మేనేజర్‌తో పాటు ముగ్గురు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. మృతుల్లో నేపాల్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, అస్సాం రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.