
శబరిమల భక్తుల పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 9 మందికి గాయాలు
శబరిమల సన్నిధానం వద్ద భక్తులపైకి ఒక ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలతో సహా మొత్తం 9 మంది భక్తులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భారీ వర్షం కారణంగా ట్రాక్టర్ అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లిందని డ్రైవర్ తెలిపాడు. క్షతగాత్రులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కూడా ఉన్నారు.




