ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టై బెయిల్‌పై వచ్చిన అల్లు అర్జున్‌కు ఆయన ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం అల్లు అరవింద్‌కు చంద్రబాబు ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలని చెప్పిన విషయం తెలిసిందే.