ఎన్నికల కోడ్‌ను ధిక్కరించి సీఎం ఫ్లెక్సీ దహనం

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ, నిబంధనలను బేఖాతరు చేస్తూ ఆదివారం బీఆర్ఎస్ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. పార్టీ పిలుపు మేరకు స్థానిక నేతాజీ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని దహనం చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. వాగ్వాదం తర్వాత ఫ్లెక్సీని దహనం చేశారు.
