సీఎం అసెంబ్లీని బూతులమయం చేశారు: హరీష్‌రావు

14చూసినవారు
సీఎం అసెంబ్లీని బూతులమయం చేశారు: హరీష్‌రావు
TG: అసెంబ్లీ సెషన్‌ను బీఆర్ఎస్ బహిష్కరించింది. స్పీకర్‌ పక్షపాత వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హరీశ్ రావు తెలిపారు. 'సభ నడిపే తీరు అధ్వాన్నంగా ఉంది. మూసీ ప్రక్షాళనపై మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. సీఎం అసెంబ్లీని బూతులమయం చేశారు. సభలో మాట్లాడనివ్వకపోతే మేం ఎందుకు రావాలి. అసెంబ్లీని సీఎల్పీగా మార్చారు. మూసీ ప్రక్షాళనకు మేం వ్యతిరేకం కాదు. పేదల ఇళ్లుకూలగొట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్