TG: వనపర్తి జిల్లా రూ.151.92 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.15 కోట్లతో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులకు, అలాగే రూ.121.92 కోట్లతో ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యామ్ దిగువన హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.