TG: వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి–రఘు నిశ్చితార్థ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. కొత్వాల్‌గూడలో గురువారం రాత్రి జరిగిన వేడుకలో పాల్గొన్న సీఎం దంపతులు.. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా నిశ్చితార్థ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.