షూటర్ ఈషా సింగ్‌కు సీఎం రేవంత్ అభినందనలు

15చూసినవారు
TG: ఆసియా క్రీడల్లో పతకం సాధించిన షూటర్ ఈషా సింగ్‌కు సీఎం రేవంత్​ అభినందనలు తెలిపారు. స్వల్ప తేడాతో స్వర్ణం కోల్పోయినా ఈషా ప్రదర్శన అద్భుతమని సీఎం ప్రశంసించారు. ఈషా సింగ్ పోరాట స్ఫూర్తి క్రీడాలోకానికి ఆదర్శమన్నారు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలతో దేశ ప్రతిష్ఠ, తెలంగాణ కీర్తిని చాటాలని ఆకాంక్షించారు. కాగా మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషాసింగ్ రజతం సాధించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్