బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం

38చూసినవారు
బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం
TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులు యుద్ధప్రాతిపదికన అక్కడికి చేరుకుని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్ కు తరలించి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్, డీజీపీలను సీఎం రేవంత్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్