SLBC టన్నెల్ సర్వే పరిశీలనకు బయలుదేరిన సీఎం రేవంత్

70చూసినవారు
SLBC టన్నెల్ సర్వే పరిశీలనకు బయలుదేరిన సీఎం రేవంత్
TG: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (SLBC) సొరంగం తవ్వకం పనుల పునరుద్థరణలో భాగంగా సోమవారం హెలికాప్టర్‌తో ‘మాగ్నెటిక్‌ జియోఫిజికల్‌ సర్వే’ను ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌, కోటిరెడ్డి వెంటక్ రెడ్డి బయలుదేరారు. నాగర్‌కర్నూలు జిల్లా మన్నేవారిపల్లి చేరుకుని సర్వేను పర్యవేక్షించనున్నారు. సర్వే జరిపే హెలికాప్టర్‌కు సమాంతరంగా మరో హెలికాప్టర్‌లో సీఎం, మంత్రి ప్రయాణిస్తూ పరిశీలిస్తారు.
Job Suitcase

Jobs near you