మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ

0చూసినవారు
మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ
TG: శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ సమావేశం అయ్యారు. గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తాజా రాజకీయాలపై చర్చించారు. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం ఖర్గే హైదరాబాద్ నుండి గుల్బర్గాకు వెళ్లారు.