తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని CM రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కల్లాల్లోని ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తైన కేంద్రాల నుంచి టార్పాలిన్లను తరలించాలన్నారు.