మక్తల్ చేరుకున్న సీఎం రేవంత్

19చూసినవారు
మక్తల్ చేరుకున్న సీఎం రేవంత్
TG: నారాయణపేట జిల్లా మక్తల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పాలమూరు ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా మక్తల్​లో పర్యటిస్తున్న సీఎం, మంత్రులు కాట్రావుపల్లిలో ఎత్తిపోతల పథకం, ప్రతిపాదిత బ్యారేజీలపై ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీ వీక్షించారు. ఈ మేరకు పథకాల గురించి సీఎంకు అధికారులు వివరించారు. సీఎం ఈ రోజు రాత్రి సోమశిలలో బస చేసి రేపు ప్రాజెక్టులను సందర్శిస్తారని అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :