TG: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పీఎం మోదీ ముందు నిలబడి నిధులు అడిగే ధైర్యం బండి సంజయ్‌కు లేదని, కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడని ఆయన ఆరోపించారు. నిజంగా బండి సంజయ్‌కు మోదీ దగ్గర పరపతి ఉంటే, కాళేశ్వరంలో వేల కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్, హరీష్ రావులను, కారు దందాలో సంపాదించిన కేటీఆర్‌ను అరెస్ట్ చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.