సీఎం రేవంత్ రెడ్డితో కొత్త డీజీపీ సీవీ ఆనంద్‍తో భేటీ

2847చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డితో కొత్త డీజీపీ సీవీ ఆనంద్‍తో భేటీ
TG: నూతన డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్ హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‍లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర శాంతిభద్రతల పరిరక్షణలో తనపై నమ్మకం ఉంచి డీజీపీగా బాధ్యతలు అప్పగించినందుకు సీఎంకు సీవీ ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు. నేరాల నియంత్రణ, డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యం, పోలీసు వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసే అంశాలపై సీఎం సూచనలు చేశారు. సీవీ ఆనంద్ మే 1న పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్