TG: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పెట్ గ్రామంలో అత్యాధునిక ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. పెరుగుతున్న నగరం, అంతర్జాతీయ పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంగా ఈ నూతన కమిషనరేట్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, డీజీపీ శివధర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.