TG: దేశంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత
ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘమే రాజకీయ కుట్రలకు కేంద్రంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో 13 కోట్లకు పైగా ఓటర్లను తొలగించడం, ఫారం-6లో మార్పులు చేయడం వంటి చర్యలు ఎన్నికల సంఘం స్వతంత్రతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఆరోపించారు. ఈసీ బీజేపీతో కుమ్మక్కైందని అన్నారు.