రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

105చూసినవారు
రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌-2026కు రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆహ్వానించిన సీఎం, గ్లోబల్ సమ్మిట్ రక్ష ఎక్స్‌పోలో భాగ‌స్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ ప్రాజెక్టుకు ఉచితంగా భూమి కేటాయించాలని సీఎం కోరారు. ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి సంబంధించి రాజ్‌నాథ్‌తో సీఎం చర్చించారు. విమానాశ్రయానికి ఇప్పటికే 750 ఎకరాలు భూసేకరణ చేపట్టామని, మరో 750 ఎకరాలు సేకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్