మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

19చూసినవారు
మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి
భారత జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి మహాత్ముని త్యాగాలను, ఆశయాలను స్మరించుకున్నారు. 'అహింసనే ఆయుధంగా స్వాతంత్య్ర సంగ్రామాన్ని జయించి.. ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసిన వ్యక్తి మహాత్ముడు. ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నాను' అని సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా 'ఎక్స్' ఖాతాలో వెల్లడించారు. గాంధీజీ అహింసా మార్గాన్ని, ఆయన ఆశయాలను స్మరించుకుంటూ ఇరువురు నాయకులు నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్