తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన నెలాఖరులోగా తిరిగి రానున్నారు. ఫిబ్రవరి 3న నల్గొండ జిల్లా మిర్యాలగూడ, 4న కరీంనగర్ జిల్లా జగిత్యాల, 5న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్‌లలో సీఎం పర్యటించనున్నారు.