TG: గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరై ఏర్పాట్లపై చర్చించారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలు 2027 జూలై 23 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు.