కేసీ వేణుగోపాల్‌తో గంటకుపైగా సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం

0చూసినవారు
కేసీ వేణుగోపాల్‌తో గంటకుపైగా సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి గంటకుపైగా పలు అంశాలపై తీవ్రంగా చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై చర్చించినట్లు సమాచారం. అలాగే  కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ అంశం కూడా చర్చించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్