TG: కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం, కరీంనగర్ నుంచి సిరిసిల్ల వెళ్లనున్న సీఎం, అక్కడ అంబేద్కర్ చౌరస్తా నుంచి సభా వేదిక వరకు దాదాపు 10 వేల మందితో కలసి భారీ పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.