TG: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. సౌమ్య కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.