మరికాసేపట్లో రాజ్యసభ అభ్యర్థులపై క్లారిటీ ఇవ్వనున్న సీఎం రేవంత్ రెడ్డి

18చూసినవారు
మరికాసేపట్లో రాజ్యసభ అభ్యర్థులపై క్లారిటీ ఇవ్వనున్న సీఎం రేవంత్ రెడ్డి
TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం బయలుదేరిన ఆయన, మరికాసేపట్లో ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున రాజ్యసభ రెండో అభ్యర్థి ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక స్థానానికి అభిషేక్ సింఘ్వీ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. రెండో స్థానానికి రాష్ట్ర నేతల నుంచి తీవ్రమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో, రేవంత్ రెడ్డి ఎవరి పేరును సూచిస్తారు, అధిష్టానం ఎవరిని ఖరారు చేస్తుంది అనేది తేలాల్సి ఉంది. హైకమాండ్ తో చర్చలు ముగిసిన అనంతరం సాయంత్రం వరకు అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్