TG: సీఎం రేవంత్ రెడ్డి బుధవారం నాడు దేశ రాజధాని ఢిల్లీకి పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు, నిధుల సమీకరణపై ఆయన దృష్టి సారించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజన హామీల అమలు, సంక్షేమ పథకాలకు తోడ్పాటుపై విజ్ఞప్తులు చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరిన నేపథ్యంలో, సంబంధిత అధికారులతో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.